తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స)
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు విదేశీ బంగారం పట్టుకున్నారు. అబుదాబి ప్రయాణీకుడి వద్ద 65 లక్షల విలువ చేసే 1221 గ్రాముల బంగారం కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ అధికారులను బురడి కొట్టించడానికి ప్రయత్నించాడు. అయితే లగేజ్ బ్యాగ్ ను అధికారులు పరిశీలించగా.. లగేజ్ బ్యాగ్ లో బంగారాన్ని ఆభరణాలుగా మార్చి దాచి తరలించే యత్నం చేశాడు కేటుగాడు. దీంతో కస్టమ్స్ అధికారుల స్క్రీనింగ్ లో బయట పడ్డ అక్రమ బంగారం గుట్టైంది. బంగారం స్వాధీనం చేసుకుని బంగారాన్ని సీజ్ చేశారు అధికారులు. అక్రమ బంగారం తరలిస్తున్న ప్రయాణీకుడు అరెస్ట్ చేసి అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార