రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారు....రేవంత్ రెడ్డి
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స) టీఆరెస్, బీజేపీపార్టీ లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డ
....


తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స)

టీఆరెస్, బీజేపీపార్టీ లపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్టీవీతో చిట్ చాట్ చేసిన ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబమే విచారణ సంస్థలను గౌరవించిందని అన్నారు. కానీ టీఆరెస్, బీజేపీ నేతలు ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కవితను, రాష్ట్రం బీఎల్ సంతోష్ ను ఎందుకు అరెస్టు చేయడంలేదు? అంటూ రేవంత్ మండిపడ్డారు. కాంగ్రేస్ ను దెబ్బతీసేందుకే టీఆర్ఎస్, బీజేపీల కుట్రఅని నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ పాలనలో కొడంగల్ కు తుప్పు పట్టిందని ఆరోపించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande