బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
బాపట్ల: 05 ,డిసెంబర్ ( హిం.స) ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘ
బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం


బాపట్ల: 05 ,డిసెంబర్ ( హిం.స) ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. వేమూరు మండలం జంపని వద్ద ఆటో బోల్తాపడి ఈ ఘటన చోటుచేసుకుంది. మరో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను తెనాలిలోని ఆస్పత్రికి తరలించారు.

మృతులు కృష్ణా జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande