సీబీఐకి ఎమ్మెల్సీ కవిత మరో లేఖ
తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స) టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన
....


తెలంగాణ : హైదరాబాద్ : డిసెంబర్ 5( హిం స)

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి మరో లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖలో స్పష్టం చేశారు. సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేని విషయాన్ని తెలియజేస్తున్నాను అని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు.. ఈ కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందిస్తూ సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన విషయం విధితమే. దానికి స్పందించిన సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉన్నదని తెలిపారు. దాంతో తాను ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న నిందితుల పేర్లతో సహా అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించానని, కానీ, అందులో తన పేరు ఎక్కడా లేదని కల్వకుంట్ల కవిత ఇవాళ ఉదయం సీబీఐ అధికారి రాఘవేంద్ర వస్తకు లేఖ రాశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande