ప్రజల ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతోకూల్చివేయడం సరైంది కాదు : సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ : మే 16 ( హిం స) ప్రజల ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అర
ప్రజల ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతోకూల్చివేయడం సరైంది కాదు : సీఎం అరవింద్ కేజ్రీవాల్


ఢిల్లీ : మే 16 ( హిం స) ప్రజల ఇండ్లు, దుకాణాలను బుల్డోజర్లతో కూల్చివేయడం సరైంది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో ఆక్రమణలను మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (ఎంసీడీ) కూల్చివేస్తోందని అన్నారు. ఈ ప్రక్రియలో కీలక అంశాలను గుర్తుంచుకోవాలని చెబుతూ ఢిల్లీలో ప్రజలు తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను చూపినా కూల్చివేతలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని మురికివాడలు, గుడిసెలను నేలమట్టం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇలాగే కాషాయ పార్టీ ఆధ్వర్యంలోని మున్సిపల్ కార్పొరేషన్లు కూల్చివేత ప్రక్రియను కొనసాగిస్తే బుల్డోజర్లకు పనిచెబితే 63 లక్షల మంది ఢిల్లీ ప్రజలు నిరాశ్రయులవుతారని అన్నారు. మురికివాడల్లో ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ దానికి బదులుగా బుల్డోజర్లతో నిర్మాణాలను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande