నీట్ యూజీ 2022 రిజిస్ట్రేషన్ గడువు 20 వరకు పొడిగింపు
ఢిల్లీ : మే 16 ( హిం స) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడా
నీట్ యూజీ 2022 రిజిస్ట్రేషన్ గడువు 20 వరకు పొడిగింపు


ఢిల్లీ : మే 16 ( హిం స) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మరోసారి పొడిగిస్తూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం మే 15 రాత్రి 9 గంటలకు ముగిసిన దరఖాస్తు గడువును మే 20 వరకు పొడిగించింది. కాగా గతంలో నీట్ యూజీ దరఖాస్తు ప్రక్రియ మే 6తో ముగియనుండగా దానిని మే 15 వరకు పొడిగించారు. ఇక తాజాగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అభ్యర్ధనల మేరకు మరోసారి రిజిస్ట్రేషన్ గడువు పొడిగించడం జరిగింది. విద్యార్ధుల అభ్యర్ధన మేరకు చివరి తేదీని పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande