ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన..... లుంబినీని సందర్శించిన మోడీ
ఢిల్లీ : మే 16 ( హిం స) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల పర్యటన కొనసాగుతోంది. ప్రధాని మోడీ నేపాల్ ప్
ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్ పర్యటన..... లుంబినీని సందర్శించిన మోడీ


ఢిల్లీ : మే 16 ( హిం స) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేపాల పర్యటన కొనసాగుతోంది. ప్రధాని మోడీ నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా కలిసి మాయా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం అశోక స్తంభంపై దీపం వెలిగించారు. అదే సమయంలో ఇద్దరి సమక్షంలో లుంబినీలోని బౌద్ధ విశ్వవిద్యాలయంలో భారతీయ ప్రొఫెసర్ నియామకంతో పాటు అనేక ముఖ్యమైన ఒప్పందాలు జరుగనున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ నేపాల్లోని లుంబినీలో దాదాపు 5 గంటలపాటు పర్యటించనున్నారు. మోడీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇప్పటికే లుంబినీకి చేరుకుంది. నేపాల్ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బిజీ షెడ్యూల్తో బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ భగవానుడి జన్మస్థలమైన లుంబినీలో ఉన్నారు.

పుట్ట సుమన్, హిందుస్థాన్ సమాచార.


 rajesh pande