వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్
హైదరాబాద్ : జనవరి 10 ( హింస) వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్


హైదరాబాద్ : జనవరి 10 ( హింస) వనస్థలిపురం రూ.2 కోట్ల చోరీ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. అతిపెద్ద హవాలా లింక్ లు ఈదోపిడీ వెనుక ఉన్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. అయితే ఈ హవాలా లింక్లలో ఎవరెవరు ఉన్నారు? ఇప్పటి వరకు ఎంత కాజేశారనే విషయంలో పోలీసులు విచారణచేపట్టారు. దోపిడీ జరిగిన సమయంలో వ్యాపారి వెంకట్ రెడ్డి వద్ద 50 లక్షలు వున్నట్టు పోలీస్ లు గుర్తించారు. 24 గంటల పాటు పోలీస్ లకు స్పష్టమైన సమాచారం వెంకట్ రెడ్డి ఇవ్వలేదు. మొదట వెంకట్ రెడ్డి పైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఫిర్యాదులో 50 లక్షలు పోయాయని వెంకట్ రెడ్డి చెప్పాడు. అయితే.. వెంకట్ రెడ్డి తో పాటు వున్న నరేష్ కోటిన్నర పోయిందంటూ పోలీస్ లకు సమాచారం ఇచ్చాడు. పోలీసుకు పొంతన లేని సమాచారంతో… అసలు దోపిడీ జరిగిందా? లేదా? అని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. తరువాత 25 లక్షలు దోపిడీ జరిగిందని పోలీసుల తేల్చేశారు. దోపిడీ చేసిన నిందితులను పోలీస్ లు గుర్తించారు. హవాలా వ్యాపారంపై స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పాత బస్తీకి చెందిన ఫరూక్ తో పాటు విదేశాల్లో వున్న ప్రవీణ్ అనే వ్యక్తికి హవాలా వ్యాపారంతో సంబంధం ఉన్నట్టు దర్యాప్తు బృందం గుర్తించింది.

హిందుస్థాన్ సమాచార/ నాగరాజ్


 rajesh pande