ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది-అనురాగ్ కశ్యప్
ముంబై, 19 జనవరి (హిం.స)సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక
అనురాగ్‌ కశ్యప్‌


ముంబై, 19 జనవరి (హిం.స)సోమవారం జరిగిన బీజేపీ కీలక సమావేశంలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల మీద కామెంట్లు చేయడం, అతిగా స్పందించడం మానుకోవాలని ప్రధాని మోదీ.. కార్యకర్తలకు సూచించారాయన. అయితే..

ప్రధాని సలహాపై తాజాగా ప్రముఖ దర్శకుడు, బాలీవుడ్ ఫిల్మ్మేకర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. పరిస్థితి ఎప్పుడో చెయ్యి దాటిపోయిందనన్నారు ఆయన. ముంబైలో తన తాజా చిత్రం ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మోదీ తన పార్టీ కార్యకర్తలకు చేసిన సూచనపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ స్పందించారు. ‘‘ప్రధాని మోదీ నాలుగేళ్ల కిందట ఈ సలహా ఇచ్చి ఉంటే బాగుండేది. పరిస్థితి ఇంకోలా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారుతుందని అనుకోవడం లేదు. పరిస్థితి చెయ్యి దాటిపోవడంతో.. జనాలు వాళ్లంతట వాళ్లే కంట్రోల్లో ఉండాల్సిందే తప్ప మరో మార్గం కనిపించడం లేదు. ఎవరు ఎవరికీ వింటారని అనుకోవడం లేద’’ని కశ్యప్ అభిప్రాయపడ్డారు.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande