కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా
ముంబై:, 19 జనవరి (హిం.స)టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానస
మానసి టాటా


ముంబై:, 19 జనవరి (హిం.స)టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్‌పర్సన్‌గా విక్రమ్ కిర్లోస్కర్ కుమార్తె మానసి టాటా నియమితు లయ్యారు. ఆమె తండ్రి విక్రమ్ కిర్లోస్కర్ అకాలమరణం తరువాత, కంపెనీ JV కంపెనీల బోర్డులో డైరెక్టర్ అయిన మానసి టాటాను టయోటా కిర్లోస్కర్ ఆటో విడిభాగాల (TKAP) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించింది. తక్షణమే వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ప్రకటించింది.

మానసి టాటా ఇప్పటికే టయోటా కిర్లోస్కర్ మోటార్లో డైరెక్టర్ల బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. అలాగే కంపెనీ కార్పొరేట్ నిర్ణయాలు ,వ్యూహాత్మక కార్యకలాపాలలో కీలకంగా ఉన్నారని కంపెనీ ఒకప్రకటనలో తెలిపింది. ఇంక్లూజివ్ థినింగ్ , పీపుల్ సెంట్రిక్ ఔట్లుక్ని తీసుకొచ్చి, భారతీయ ఆటో పరిశ్రమపై ఆమెకున్న పదునైన అవగాహనతో పాటు, 'అందరికీ మాస్ హ్యాపీనెస్' అందించడంలో కంపెనీ నిబద్ధతను ఆమె నియామకం మరింత బలోపేతం చేస్తుందని టొయోటా కిర్లోస్కర్ మోటార్ సీఎండీ మసకాజు యోషిమురా అన్నారు

మానసి టాటా అమెరికాలోని రోడ్ ఐలాండ్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యారు. కేరింగ్ విత్ కలర్ అనే ఎన్జీవో ద్వారా కర్ణాటకలోని మూడు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలలపై పనిచేస్తున్నారు ఆమె 2019లో నోయెల్ టాటా (రతన్ టాటా సవతి సోదరుడు)కుమారుడు నెవిల్లే టాటాను వివాహం చేసుకున్నారు. కి

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande