చికిత్స అందించి న మేయర్ బంగి అనిల్ కుమార్
తెలంగాణ:జనవరి :21: పెద్దపల్లి జిల్లా :హింస:సిద్దిపేట పట్టణ సమీపంలో రాజీవ్ రహదారి వద్ద శుక్రవారం రాత్
చికిత్స అందించి న మేయర్ బంగి అనిల్ కుమార్


తెలంగాణ:జనవరి :21: పెద్దపల్లి జిల్లా :హింస:సిద్దిపేట పట్టణ సమీపంలో రాజీవ్ రహదారి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడికి చికిత్స అందించి ప్రాణాపాయం జరగకుండా కాపాడారు స్వతహాగా వైద్యుడైన రామగుండం నగర మేయర్ డా. బంగి అనిల్ కుమార్.

రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీ కొట్టడంతో రెండు టైర్ల మధ్య పడి తీవ్రంగా గాయపడిన ద్విచక్ర వాహన చోదకుడిని అదే దారిలో వెళుతున్న వారు గమనించి బయటకు లాగారు.

అతడికి తీవ్రగాయాలతో రక్త స్రావం జరుగుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న నేపథ్యంలో అదే రోడ్డుపై ప్రయాణిస్తున్న మేయర్ తన వాహనాన్ని ఆపి అతడికి వస్త్రంతో కట్టుకట్టారు.

అత్యవసరమైన మందుల కోసం మెడికల్ షాపు కు ఒక వ్యక్తిని పంపారు. ఈ లోపు అంబులెన్స్ చేరుకోవడంతో అందులో ఉన్న వైద్య పరికరాల సహాయంతో అతనికి ప్రాణాపాయం జరగకుండా ఆసుపత్రికి వెళ్లేంతవరకు అంబులెన్స్ లోనే ఉండి వైద్య చికిత్స అందించి మానవతా హృదయం చాటుకున్నారు.

హిందూస్తాన్ సమాచార/బి.నాగభూషణం


 rajesh pande