విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం
తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి:24 (హిం.స) ఎబివిపి షాదనగర్ నగర కార్యదర్శి జి. సందీప్ ఆధ్వర్యంలో
విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం


తెలంగాణ రంగా రెడ్డి షాద్ నగర్ జనవరి:24 (హిం.స) ఎబివిపి షాదనగర్ నగర కార్యదర్శి జి. సందీప్ ఆధ్వర్యంలో షాదనగర్ చౌరస్తా వద్ద నల్ల బ్యాడ్జిలతో నిర్వహించి నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా శంషాబాద్ జిల్లా కన్వీనర్ చాకలి మహేష్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు పుట్నాల సాయి మాట్లాడుతూ రాష్ట్రం సాగుతున్న కెసిఆర్ విద్యార్థి వ్యతిరేక, అవినీతి, అసమర్థ విధానాలకు నిరసిస్తూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎబివిపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన చేయటం జరిగిందని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 5500 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు.

పెంచిన ఇంజనీరింగ్ ఫీజులను తగ్గించి, ప్రభుత్వమే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలనీ, ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో మౌలిక వసతులు కల్పించాలనీ, డిమాండ్ చేశారు

జనార్దన్ రెడ్డి , హిందూస్థాన్ సమాచార్


 rajesh pande