మహారాష్ట్రలో విషాదం.....నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం
ఢిల్లీ : జనవరి 24( హింస) మహారాష్ట్రలోని పుణె జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో నదీగర్భంలో
మహారాష్ట్రలో విషాదం.....నదిలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యం


ఢిల్లీ : జనవరి 24( హింస) మహారాష్ట్రలోని పుణె జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పుణె జిల్లాలో నదీగర్భంలో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. మృతుల్లో వృద్ధ దంపతులు, వారి కూతురు, అల్లుడు, ముగ్గురు మనుమలు ఉన్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. మృతులు ఏడుగురూ ఒకే కుటుంబానికి చెందినవారు, అందులో దంపతులు, వారి కుమార్తె, అల్లుడు, వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు. భీమా నదిలో ఒకదానికొకటి 200 నుంచి 300 మీటర్ల దూరంలో మృతదేహాలు కనుగొనబడ్డాయని పోలీసులు వెల్లడించారు. మృతదేహాలను వెలికి తీశామని, మృతికి గల కారణాలు, పరిస్థితులపై విచారణ జరుపుతున్నామని తెలిపారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande