జర్నలిస్టుల రైల్వే పాసుల రాయితీ పునరుద్ధరించాలి
తెలంగాణ:మహబూబ్ నగర్ జిల్లా:జనవరి 24 (హిం స) కేంద్ర పరదిలో ఉన్న జర్నలిస్టుల రైల్వే పాసుల 50% రాయతి
జర్నలిస్టుల రైల్వే పాసుల రాయితీ పునరుద్ధరించాలి


తెలంగాణ:మహబూబ్ నగర్ జిల్లా:జనవరి 24 (హిం స) కేంద్ర పరదిలో ఉన్న జర్నలిస్టుల రైల్వే పాసుల 50% రాయతి (సబ్సిడీ) పునరుద్ధరణ విషయం గురించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్ నగర్ జిల్లా కమిటీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ మెంబర్ బండి సంజయ్ ని కలిసి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వాకిట అశోక్ కుమార్ బండి సంజయ్ కి జర్నలిస్టుల రైల్వే పాసుల రాయితీ పునరుద్ధరించాలని వివరించారు. దేశవ్యాప్తంగా మొదటి నుంచి జర్నలిస్టులకు రైల్వే పాస్ లలో 50% రాయితీ ఉండేదనీ ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగుతుందన్నారు .భాజపా మోడీ ప్రభుత్వం లో కూడా ఈ రాయితి కొనసాగింది కానీ మన ప్రధానమంత్రి మోడీ కరోనా సమయం లో ఆర్థిక లేమి వల్ల అందరికీ రాయితీలు తొలగించారని అందులో భాగంగా జర్నలిస్టులకు కూడా రాయితీ లు తొలగించారని తెలిపారు.

మహి పాల్ రెడ్డి ,హిందుస్థాన్ సమాచార


 rajesh pande