ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్
తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 24( హింస) సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామ
ఎంపికైన నాటు నాటు సాంగ్


తెలంగాణ : హైదరాబాద్ : జనవరి 24( హింస) సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.

ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి.

ఆస్కార్ నామినేషన్ పూర్తి జాబితా

ఒరిజినల్ సాంగ్

నాటు నాటు (ఆర్ఆర్ఆర్)

అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)

హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)

లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)

ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ సహాయ నటుడు

బ్రెన్డాన్ గ్లెసన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)

బ్రైయిన్ టైరీ హెన్రీ (కాజ్వే)

జడ్ హిర్చ్ (ది ఫేబుల్‌మ్యాన్స్)

బేరీ కియోఘాన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)

కి హుయ్ క్వాన్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

ఉత్తమ సహాయ నటి

ఆంజెలా బాస్సెట్ (బ్లాక్ పాంథర్: వకండ ఫరెవర్)

హాంగ్ చ్యూ (ది వేల్)

కెర్రీ కాండన్ (ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్)

జామీ లీ కర్టిస్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

స్టెఫానీ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)

కాస్ట్యూమ్ డిజైన్ నామినేషన్స్

బేబీలాన్ (మ్యారీ జోఫెర్స్)

బ్లాక్‌పాంథర్: వకండా ఫరెవర్ (రూథ్‌కార్టర్)

ఎల్విస్( కేథరిన్ మార్టిన్)

ఎవ్రీథింగ్, ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ (షెర్లీ కురాట)

మిసెస్ హారిస్ గోస్ టు పారిస్ (జెన్నీ బియావాన్)

సౌండ్ నామినేషన్స్

ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్

అవతార్:ది వే ఆఫ్ వాటర్

ది బ్యాట్‌మెన్

ఎల్విస్

టాప్ గన్:మార్విక్

హిందుస్థాన్ సమాచార/ నాగరాజ్


 rajesh pande