ఫ్లాట్గా కొనసాగించిన స్టాక్ మార్కెట్ సూచీలు
ఢిల్లీ : జనవరి 24( హింస) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభించాయి. ఉదయం సెన్సెక
ఫ్లాట్గా కొనసాగించిన స్టాక్ మార్కెట్ సూచీలు


ఢిల్లీ : జనవరి 24( హింస) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 61,122.20 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,266.06- 60,849.12 మధ్య కదలాడింది. చివరకు 37.08 పాయింట్ల స్వల్ప లాభంతో 60,978.75 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 18,183.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి ఇంట్రాడేలో 18,201.25- 18,078.65 మధ్య చలించింది. చివరకు 0.25 పాయింట్ల అత్యల్ప నష్టంతో 18,118.30 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81.64 వద్ద నిలిచింది.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande