ముంబై, 10 నవంబర్ (హిం.స) బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి’తో మరో బ్లాక్ బాస్టర్ ఇచ్చారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో ఆయన వైవిధ్యమైన పాత్ర పోషించారు.
తెలంగాణ వ్యక్తిగా… యాస, భాషలో అలరించారు. అంతేకాదు, శ్రీలీలకు చిచ్చాగా కనిపించారు. అంటే తెలంగాణలో చిచ్చా అంటే బాబాయ్ అని అర్థం. అనిల్ రావిపూడి తనను సినిమాలో పాత్రను అనుసరించి బాబాయ్గా చూపించారు కానీ.. తన వయసును దృష్టిలో పెట్టుకుని ఎవడైనా తనను బాబాయ్ అని పిలిస్తే దబిడి దిబిడే అంటూ బాలయ్య పంచ్ పేల్చారు. ‘భగవంత్ కేసరి’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్’ అంటూ హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు.
సినిమాకు పనిచేసిన వాళ్లందరినీ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు చేతుల మీదగా జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.
ఈ ఈవెంట్లో బాలయ్య మాట్లాడుతూ.. ‘వయసును బట్టి నన్నెవడైనా బాబాయ్ అనో, ఇంకేమైనా పిలిస్తే మాములుగా ఉండదు. దబిడిదిబిడే. ఈ సినిమాలో శ్రీలీలకి చిచ్చాగా చేశాను. ఈ సినిమా ద్వారా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నామని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు దేనికైనా రెడీ అవ్వాలి మనం. ఒక నటుడిగా మనం చెప్పింది జనంలోకి బలంగా వెళ్తుంది. సినిమాకు మించిన మాధ్యమం లేదు. అయినా సరే అందరూ చెప్తే ప్రజల్లోకి వెళ్లదు. అది నా బాధ్యతగా భావించి సినిమా స్టోరీ చెప్పిన వెంటనే తప్పకుండా చేద్దామని అన్నాను’ అని బాలయ్య పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక్కో పాత్ర ఎంతో అద్భుతమని.. అన్ని పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయని బాలయ్య అన్నారు. సినిమాలో ప్రతి ఆర్టిస్ట్ అన్ని రసాలు పలికించారని బాలయ్య కొనియాడారు.
హిందూస్తాన్ సమాచార్,సంధ్యా