కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం
తెలంగాణ : హైదరాబాద్ :నవంబర్20( హింస ) కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సీఎం కేసీఆర్ ఆగ్రహం


తెలంగాణ : హైదరాబాద్ :నవంబర్20( హింస )

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు అని కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని కంచర్ల భూపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రగల్భాలు మీకు తెలుసు. వాళ్ల డబ్బు అహంకారంతోని ఇంతకు ముందే నాకు నకిరేకల్లో చెబుతున్నారు. నకిరేకల్లో మేం గెలిచిన తర్వాత రామన్నపేట నుంచి నకిరేకల్ దాకా అందర్నీ పండవెట్టి తొక్కుతం అని మాట్లాడుతున్నారు కోమటిరెడ్డి. ఈ పండవెట్టి తొక్కేటోళ్లే కావాల్నా ఎమ్మెల్యేలు..? వీళ్లేనా మనకు కావాల్సింది. భూపాల్ రెడ్డి ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉన్న వ్యక్తి. గతంలో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయాడు ఆయన. ఎమ్మెల్యేగా ఓడిపోతే ఆయన హైదరాబాద్ పోయి ఉండలే. నల్లగొండలో అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు కూడా మార్చలేదు. ఇవాళ ఎమ్మెల్యే ఉన్న అదే ఇంట్లో ఉన్నడు తప్ప ఇల్లు మార్చలేదు. ప్రజల మధ్యలో ఉండి, పొద్దున్నే లేస్తే మీ మధ్యలో తిరిగేటోళ్లు కావాల్నా..? గెలిచిన తెల్లారే హైదరాబాద్లో పడేటోళ్లు కావాల్నా..? దయచేసి ఆలోచించాలి అని కేసీఆర్ కోరారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande