కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలంగాణలో కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ ఎన్నిక ప్రచారం
తెలంగాణ : హైదరాబాద్ :నవంబర్20( హింస ) కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ న
కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలంగాణలో కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ ఎన్నిక ప్రచారం


తెలంగాణ : హైదరాబాద్ :నవంబర్20( హింస )

కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ నేడు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీకే హరిప్రసాద్ మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కలిసి మెలిసి ఉంటారని, గత చివరి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే లను కొనుగోలు చేసి కూల్చేసింది బీజేపీనేని ఆయన మండిపడ్డారు. డబులింజన్ సర్కార్ నినాదం తోవచ్చిన బీజేపీ ని కర్ణాటక లో ప్రజలు ఓడించారన్నారు బీకే హరిప్రసాద్. తెలంగాణలో ట్రిపులింజన్ పేరుతో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం లు కలిసి పనిచేస్తున్నా కాంగ్రెస్‌ను ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా వున్నారన్నారు బీకే హరిప్రసాద్. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన కూతురు ను జైలు కు వెళ్లకుండా కాపాడుకుంటున్నాడని ఆయన ఆరోపించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande