పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్న వ్యక్తి
ఆంధ్రప్రదేశ్ : అమరావతి: నవంబర్20( హింస) పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప
పోలీస్‌స్టేషన్‌ ఎదుట పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్న వ్యక్తి


ఆంధ్రప్రదేశ్ : అమరావతి: నవంబర్20( హింస)

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై హిమబిందు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మణికంఠ.. తమిళనాడులోని తిరుత్తణికి చెందిన దుర్గని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఎనిమిదేళ్ల కుమార్తె, ఐదేళ్ల అభయ్ అనే పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. మూడు నెలలు క్రితం భర్తతో దుర్గ విభేదించి తిరుపతి చేరుకుంది. అక్కడ సోనూ అలియాస్ బాషాతో ఆమెకు పరిచయం ఏర్పడింది. సహజీవనం చేస్తున్న వారిద్దరూ.. చంద్రగిరి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే పగడాల శ్రీనివాసులు సహకారంతో భాకరాపేటలో మకాం పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న భర్త మణికంఠ.. చంద్రగిరి పీఎస్‌కు చేరుకుని కానిస్టేబుల్ శ్రీనివాసులను నిలదీశాడు. భార్యను వదిలేసి వెళ్లిపోవాలని.. లేకుంటే దొంగతనం కేసు పెట్టి లోపలేస్తానని కానిస్టేబుల్ బెదిరించాడు. దీంతో మనస్తాపం చెందిన మణికంఠ.. పీఎస్‌ పక్కనే ఉన్న బంక్ నుంచి 5 లీటర్ల పెట్రోల్‌ తీసుకొచ్చి ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలతో అలాగే స్టేషన్‌లోకి వెళ్లి ఆర్తనాదాలు చేశాడు. పోలీసులు, స్థానికులు ఆ మంటలను ఆర్పారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande