విమానంలో ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన
బెంగళూరు, 20 నవంబర్ (హిం.స) : మద్యం తాగి విమానంలో ప్రయాణించడమే తప్పు.. ఆపై ప్రయాణికులతో గొడవ పడితే
విమానంలో ప్రయాణికులతో అసభ్య ప్రవర్తన


బెంగళూరు, 20 నవంబర్ (హిం.స)

: మద్యం తాగి విమానంలో ప్రయాణించడమే తప్పు.. ఆపై ప్రయాణికులతో గొడవ పడితే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో జరిగింది.

విమాన సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ లోని జైపుర్ నుంచి బెంగళూరుకు ప్రయాణించే విమానంలో 32 ఏళ్ల ఓ వ్యక్తి మద్యం తాగి ఎక్కాడు. మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ప్రయాణికులు హెచ్చరించినా ప్రవర్తన మారకపోవడంతో విమాన సిబ్బందికి సమాచారం అందించారు. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగాక అతన్ని పోలీసులకు అప్పగించారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande