అభిజీత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన .. ముహూర్తం ఫిక్స్
అయోధ్య, 20 నవంబర్ (హిం.స) దేశ ప్రజలంతా ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప
అభిజీత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహ ప్రతిష్టాపన .. ముహూర్తం ఫిక్స్


అయోధ్య, 20 నవంబర్ (హిం.స)

దేశ ప్రజలంతా ఎప్పుడు ఎప్పుడాని ఎదురు చూస్తున్న అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మృగశిర నక్షత్రంలో అయోధ్య రామమందిరంలో రామయ్య విగ్రహ ప్రతిష్టాపన ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు అన్నీ చకచకా జరిగిపోతున్నాయి.

రామ భక్తులతో పాటు హిందువులే కాకుండా మతాలకు అతీతంగా రామయ్య వేడుకను చూసేందుకు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రామయ్య కోసం ఎంతోమంది భక్తులు మతాలకు అతీతంగా ఎన్నో కానుకలు సమర్పించారు. మరెన్నో కళా ఖండాలను తమ స్వహస్తాలతో తయారు చేసిన రామయ్య విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎదురు చూస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వంతో పాటు యూపీ ప్రభుత్వం కూడా ఈ వేడులను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దశాబ్దాల వివాదం ముగిసాక అయోధ్యంలో రామ మందర నిర్మాణం..విగ్రహ ప్రతిష్టాపనలో ఎన్నో..ఎన్నెన్నో విశేషాలు దాగున్నాయి. అటువంటి రామ మందిరం..రామయ్య విగ్రహ ప్రతిష్టాపన ఎంతో ఆసక్తికరంగా..అంగ రంగ వైభోగంగా జరుగనుంది. ఈ వేడుకను కన్నులారా వీక్షించేందుకు దేశమంతా ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూస్తోంది.

ఇక రామయ్య వేడుకకు ముహూర్తం ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమయానాకే ఈ వేడును నిర్వహించనుంది. 2023 చివరికల్లా రామ మందిర నిర్మాణం పూర్తి చేసి 2024 జనవరిలో రామయ్య విగ్రహ ప్రతిష్టాపన జరిపి అయోధ్య రాముడిని భక్తులకు దర్శనం చేయిస్తామని ఇచ్చిన మాట ప్రకారం మరికొన్ని రోజుల్లోనే రామయ్య దర్శనం భక్తులకు కలుగనుంది. దీని కోసం ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. దీంట్లో భాగంగా జనవరి 22 మధ్యాహ్నా 12.20 గంటలకు మృగశిర నక్షత్రంలో అభిజీత్ ముహూర్తంలో అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్టం జరుగనుంది.

నాలుగు దశలుగా ఈ వేడుకలను విభజించి జరిపించనున్నారు. దీంట్లో భాగంగా తొలిదశలో కార్యాచఱణ సిద్ధం చేస్తారు. అలాగే రెండో దశలో 10 కోట్ల కుటుంబాలకు రామయ్య అక్షింతలు, రాంలాల చిత్రం, కరపత్రం ఇస్తారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande