తెలంగాణ : హైదరాబాద్ :నవంబర్20( హింస )
కూకట్‌పల్లి జేఎన్టీయూ యూనివర్సటీ వద్ద ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. స్టూడెంట్ లీడర్ ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడుతూ.. యూనివర్సిటీ పరిధిలోని R17, R18, R22లో జరిగిన పరీక్షలకు సంబంధించి క్రెడిట్ విధానాల వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. కోవిడ్ సమయంలో సరైన తరగతులు జరగక విద్యార్థులకు ఇబ్బందులు పడడమే కాకుండా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార