వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో మోదీ సమావేశం
ఢీల్లీ, 29 నవంబర్ (హిం.స) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో బృహత్తర కార
వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో మోదీ సమావేశం


ఢీల్లీ, 29 నవంబర్ (హిం.స)

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర పేరుతో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 30వ తేదీన ఉదయం 11 గంటలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు. ఆ తరువాత ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధి పొందిన వారితో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు దోహదపడేందుకు కీలక అడుగులు వేయనున్నారు.

కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 15వేల డ్రోన్లను స్వయం సహాయక సంఘాలకు అందించనున్నారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే మహిళలకు ఉపాధి చేకూర్చనున్నారు.

ఈ కేంద్రాల్లో మహిళలకు డ్రోన్ ఎలా ఎగురుతుంది, దీని వల్ల వ్యవసాయానికి ఎలా ఉయోగం అవుతుంది అనే అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. దేశంలో సంపూర్ణ ఆరోగ్యం అందించడం మరో అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande