చిరుత దాడికి గురైన లక్షిత కుటుంబానికి 5 లక్షలు ఇవ్వకపోవడంపై ఏపి హైకోర్ట్ అభ్యంతరం
అమరావతి:29 నవంబర్ (హిం.స) తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి 5 లక్షలు ఇవ్వకప
చిరుత దాడికి గురైన లక్షిత కుటుంబానికి 5 లక్షలు ఇవ్వకపోవడంపై ఏపి హైకోర్ట్ అభ్యంతరం


అమరావతి:29 నవంబర్ (హిం.స) తిరుమల కాలిబాటలో చిరుత దాడిలో మరణించిన లక్షిత కుంటుంబానికి 5 లక్షలు ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది.

కోర్టు ఆదేశించినా చెల్లించకపోవడం ఏమిటని టీటీడీపై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ధనిక ఆలయం ఆయినా డబ్బు చెల్లించక పోవడం ఏమిటని ప్రశ్నించింది. నడకదారిలో ఫెన్సింగ్ వేసేందుకు వైల్డ్ లైఫ్ కార్పొరేషన్ ఆఫిడవిట్లో సుముఖత వ్యక్తం చేసింది.

అవసరమైన ప్రాంతాల్లో అండర్ పాసులు ఏర్పాటు చేసేందుకు కూడా అభ్యంతరం లేదని వైల్డ్ లైఫ్ తెలిపింది.

హిందూస్తాన్ సమాచార, రాజీవ్


 rajesh pande