'ఓటీటీలు అలా చేయడం బాధాకరం'..--రిషబ్ శెట్టి
మంగళూరు, 29 నవంబర్ (హిం.స) రిషబ్ శెట్టి.. ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అంతకు ముందు
Rishab Shetty Comments On OTT Platforms And 


మంగళూరు, 29 నవంబర్ (హిం.స)

రిషబ్ శెట్టి.. ఇప్పుడీ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అంతకు ముందు కన్నడ సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్‏గా పేరున్న రిషబ్ శెట్టికి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో అభిమానులు ఉన్నారు.

ఆయన తెరకెక్కించిన కాంతార సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముందుగా కన్నడలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ తర్వాత అన్ని భాషల్లోనూ సత్తా చాటింది.

దీంతో వరల్డ్ వైడ్ రిషబ్ శెట్టి పేరు మారుమోగింది. నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు.

ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. “కాంతార సక్సెస్ తర్వాత ఇతర సినీ పరిశ్రమల నుంచి నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ నేను వాటిని ఒప్పుకోలేదు. కన్నడ ప్రేక్షకులకు నేను ఎప్పుడూ కృతజ్ఞుడిని. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు సినిమాలు చూస్తారు. నా కొత్త సినిమా కాంతార ఏ లెజెండ్.. చాప్టర్ 1 గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. దాని గురించి అడియన్స్ మాట్లాడాలి. ఇప్పుడు నా టీమ్ మొత్తం కాంతార సినిమాపైనే దృష్టిపెట్టాం. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజానికి కాంతార చిత్రీకరణ సమయంలో ఈ ప్రీక్వెల్ తెరకెక్కించాలనే ఆలోచన వచ్చింది. ఈ సినిమా హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని అనుకున్నాం. ” అంటూ చెప్పుకొచ్చారు.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande