కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం
ఉత్తరకాశీ, 29 నవంబర్ (హిం.స) ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగ
కార్మికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆర్థిక సహాయం


ఉత్తరకాశీ, 29 నవంబర్ (హిం.స)

ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్ లో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన కార్మికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది.

ఈసొరంగంలో మొత్తం 41మంది కార్మికులు చిక్కుకుని 17 రోజుల తరువాత రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నెరవేరటంతో సురక్షితంగా బయటకొచ్చారు. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది.

సీఎం పుష్కర్ ధామీ ఒక్కొక్కరికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే కార్మికులకు చికిత్సతో పాటు వారంతా తమ ఇళ్లకు చేరేవరకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande