కొత్త దంపతులతో సహా హైదరాబాదు చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు
హైదరాబాద్, 4 నవంబర్ (హిం.స) వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ఇటలీలో వివాహం చేసుకున్నాక, ఈరోజు హైదరా
కొత్త దంపతులతో సహా హైదరాబాదు చేరుకున్న మెగా కుటుంబ సభ్యులు


హైదరాబాద్, 4 నవంబర్ (హిం.స)

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు ఇటలీలో వివాహం చేసుకున్నాక, ఈరోజు హైదరాబాదు చేరుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లకి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో అభిమానులు పూల వర్షం కురిపించారు.

ఈ ఇద్దరితో పాటు మొత్తం మెగా కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాదు చేరుకున్నారు. వీళ్లందరికన్నా ఒకరోజు ముందుగానే పవన్ కళ్యాణ్ హైదరాబాదు చేరుకున్నారు.

అలాగే అల్లు అర్జున్ దంపతులు కూడా ముందుగానే వచ్చేసారు.

ఈరోజు మిగతా మెగా కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాదు చేరుకున్నారు. నటుడు నితిన్ , అతని భార్య కూడా వరుణ్ తేజ్, లావణ్య ల వివాహానికి హాజరైన సంగతి తెలిసిందే.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande