దీపావళికి సినిమాల జాతర
ముంబై, 6 నవంబర్ (హిం.స) ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ చిత
దీపావళికి సినిమాల జాతర.. థియేటర్లలో, ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు


ముంబై, 6 నవంబర్ (హిం.స)

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సత్తా చాటుతున్నాయి. ఈ చిత్రాలకు పోటీనిచ్చేందుకు ఇప్పటివరకు భారీ బడ్జెట్ పెద్ద సినిమాలు లేకపోవడంతో.. ఇప్పుడంతా చిన్న చిత్రాలదే హవా నడుస్తోంది.

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మ్యాడ్, కీడా కోలా, మా ఊరి పొలిమేర 2 చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం థియేటర్లలోనే కాదు.. ఓటీటీల్లోనూ చిన్న సినిమాలకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ఇక ఇప్పుడు దీపావళి కానుకగా థియేటర్లలో డబ్బింగ్ సినిమాలే ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి.

నవంబర్ రెండో వారంలో తెలుగులో చిన్న సినిమాలు రిలీజ్ కాబోతుండడంగా.. డబ్బింగ్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక అటు ఓటీటీల్లోనూ ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలు రెడీ అయినట్లు తెలుస్తోంది. దీపావళీ కానుకగా జపాన్, జిగర్తాండ, టైగర్ 3 వంటి చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి.

హిందూస్తాన్ సమాచార్,సంధ్యా


 rajesh pande