'వేద' విడుదల తేదీ ఖరారు!
చెన్నై, ఫిబ్రవరి 02 ( హింస) , 2 ఫిబ్రవరి (హిం.స) కన్నడ హీరో శివరాజ్కుమార్ (sivaraj kumar)నటించిన చిత
‘వేద’ విడుదల


చెన్నై, ఫిబ్రవరి 02 ( హింస) , 2 ఫిబ్రవరి (హిం.స) కన్నడ హీరో శివరాజ్కుమార్ (sivaraj kumar)నటించిన చిత్రం ‘వేద’(veda). కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి ఈ నెల 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం తెలుగు పోస్టర్ను ఫస్ట్ గ్లింప్స్ను ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని, త్వరలో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహిస్తాం. మా సినిమాకు అన్ని రకాలుగా సహకరిస్తున్న ప్రభాస్కి కృతజ్ఞతలు అని నిర్మాత తెలిపారు.

కన్నడలో శివరాజ్కుమార్ నటించిన 125వ చిత్రమిది. ఆయన భార్య గీత శివరాజ్ కుమార్ నేతృత్వంలోని తన హోం బ్యానర్ అయిన గీతా పిక్చర్స్లో వస్తున్న తొలి చిత్రమిది.

హిందూస్తాన్ సమాచార్


 rajesh pande