విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సహాయం
ఆంధ్రప్రదేశ్ : అమరావతి :ఫిబ్రవరి 3( హింస) ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన
విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సహాయం


ఆంధ్రప్రదేశ్ : అమరావతి :ఫిబ్రవరి 3( హింస)

ఈ ఏడాది టాప్ 200 విదేశీ యూనివర్శిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు మొదటి విడత విద్యా దీవెన సహాయం అందచేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 213 మంది విద్యార్ధులకు లబ్ది చేకూరనుంది. మొదటి విడత సాయంగా రూ. 19.95 కోట్లు విడుదల చేశారు సీఎం. లబ్ధిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేశారు సీఎం వైఎస్ జగన్. ఏటా 2 సీజన్లలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు. టాప్ 100 విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 1.25 కోట్ల వరకు 100 శాతం ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్. మిగిలిన వారికి గరిష్టంగా రూ. 1 కోటి వరకు ట్యూషన్ ఫీజు రీయింబర్స్మెంట్ అందుతుందన్నారు సీఎం జగన్.

100 నుండి 200 క్యూఎస్ ర్యాంకులు పొందిన యూనివర్శిటీలలో ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ. 75 లక్షల వరకు ట్యూషన్ ఫీజు రీఎంబర్స్మెంట్. మిగిలిన విద్యార్ధులకు గరిష్టంగా రూ. 50 లక్షలు లేదా ట్యూషన్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లింపు. విదేశీ విశ్వవిద్యాలయానికి వెళ్ళే విద్యార్ధులకు విమాన, వీసా ఛార్జీలు సైతం రీఇంబర్స్మెంట్ చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమను సంప్రదించవచ్చన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande