డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో ను ప్రారంభించిన హోం మంత్రి మహమూద్ అలీ
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 3( హింస) రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబి
....


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 3( హింస)

రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మాదాపూర్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డెయిరీ, ఫుడ్ ఎక్స్ పో (2023) ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోషకాహార గుణాలను కలిగి ఉండే పాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉందని అన్నారు. హైదరాబాద్ నగరానికి ప్రతి రోజు కోటి లీటర్ల పాలు అవసరం కాగా 60 నుంచి 70 లక్షల లీటర్ల వరకు మాత్రమే సరఫరా అవుతుందని అన్నారు. అదనపు పాల ఉత్పత్తికి మరిన్ని పశువుల పెంపకం అవసరం ఉంటుందని అన్నారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ సోమ భరత్ మాట్లాడుతూ మూతపడే స్థితికి చేరుకున్న విజయ డెయిరీ నేడు ఎవరూ ఊహించనంత గొప్పగా ఎదిగిందని అన్నారు. రూ. 7 వందల కోట్ల టర్నోవర్ సాధించి వేయి కోట్ల లక్ష్యంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విజయ డెయిరీ మరో 2 వేల ఔట్లెట్లను ఏర్పాటుచేసేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande