బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టేందుకు భాగస్వామ్యం వహించిన రాపిడో మరియు రేస్ ఎనర్జీ
తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 3( హింస) భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న షేర్డ్ రైడ
...


తెలంగాణ : హైదరాబాద్ : ఫిబ్రవరి 3( హింస) భారతదేశం యొక్క అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న షేర్డ్ రైడ్ అగ్రిగేటర్ అయిన రాపిడో మరియు బ్యాటరీ-స్వాపింగ్ డీప్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థ అయిన రేస్ ఎనర్జీ, దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఆటోలను మోహరించేందుకు తమ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. హైదరాబాద్ లో ప్రారంభించి 2023 చివరి నాటికి ఇతర నగరాలకు ఏ-ఆటోలు విస్తరించబడతాయి.

ఈ వాహనాలు రేస్ యొక్క ఆధునికమైన స్వాపింగ్ టెక్నాలజీతో అనుసంధానించబడి, అతి సులభమైన స్వాప్ పాయింట్ల నెట్వర్క్ వీటికి అందుబాటులో ఉంటాయి.

మార్కెట్ లీడర్లుగా, రాపిడో రోజుకు ఒక మిలియన్ రైడ్లతో అతి పెద్ద కస్టమర్ బేస్ను కలిగివుంది. రేస్ యొక్క ఆధునికమైన టెక్నాలజీ తో అమర్చబడిన ఎలక్ట్రిక్ ఆటోలు జీరో డౌన్టైమ్తో ప్రజలకు క్లీన్ అండ్ గ్రీన్ సేవను అందించడంలో సహాయపడతాయి.

సంయుక్తంగా లాస్ట్ మైల్ మొబిలిటీని 100% క్లీన్ మరియు ఎలక్ట్రిక్గా మార్చడం ద్వారా ఇది విప్లవాత్మక మార్పులకు తొలి అడుగు.

‘‘ఈ భాగస్వామ్యం హరిత పర్యావరణహితమైన రవాణా పరిష్కారానికి ఒక గొప్ప అడుగు. మా కస్టమర్లకు సాధ్యమైనంత ఉత్తమమైన అనుభవాన్ని అందించడానికి రాపిడో ఎల్లప్పుడూ నిరంతర ప్రయత్నం చేస్తుంది. రేస్ ఎనర్జీ యొక్క బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీ మరియు శక్తివంతమైన బ్యాటరీలు ప్రజలకు ఎలక్ట్రిక్ ట్రాన్స్పోర్ట్ ను అందుబాటులో ఉంచడంలో మాకు సహాయపడతాయి.

ఈ భాగస్వామ్యం ఇద్దరు పార్టీలకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నాము. ఎలక్ట్రిక్ వాహనాలు భారతీయ మార్కెట్లో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుండగా మేము ఎల్లప్పుడూ భవిష్యత్తును స్వీకరించడానికి సంసిద్దంగా ఉంటాము’’ అని రాపిడో, సహ వ్యవస్థాపకుడు, అరవింద్ సంకా అన్నారు.

‘‘మా అత్యాధునిక బ్యాటరీ-స్వాపింగ్ టెక్నాలజీ ద్వారా లాస్ట్ మైల్ మొబిలిటీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి మా సహకార మిషన్లో మేము వేగంగా అభివృద్ధి చెందుతున్న టాక్సీ అగ్రిగేటర్ రాపిడోతో చేతులు కలిపాము.

రాపిడోతో భాగస్వామ్యం కావడం ద్వారా, మా మా ప్రొడక్ట్స్ మరియు సేవలను వ్యాపించడానికి మరియు మా టెక్నాలజీతో ఎక్కువ మంది ప్రయాణికులను ఆనందపరచడం మా లక్ష్యం. ఇది మా నెట్వర్క్ను అనేక ఇతర నగరాలకు విస్తరించడానికి మరియు ఎక్కువ సంఖ్యలో ఇ-ఆటో డ్రైవర్లను ఆన్బోర్డ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. దీని ఫలితంగా మా బ్యాటరీలు అధికంగా వినియోగించబడతాయి మరియు కాలుష్యాన్ని తగ్గిస్తాయి’’ అని రేస్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఒ అరుణ్ శ్రేయస్ అన్నారు.

రేస్ ఎనర్జీ స్వప్పేబల్ బ్యాటరీ ప్యాక్ల కోసం AIS 156 సేఫ్టీ సర్టిఫికేషన్ను పొందిన భారతదేశంలోని మొట్ట మొదటి కంపెనీలలో ఒకటి. ఆటోమోటివ్ రీసర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI)చే ధృవీకరించబడినది, ఈ సర్టిఫికేషన్ ప్రపంచవ్యాప్తం లో EV బ్యాటరీలకు అత్యుత్తమైన ప్రమాణంతో సమానం.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande