జనసేనతో పొత్తులపై సోము వీర్రాజు క్లారిటీ
ఆంధ్రప్రదేశ్ : అమరావతి :ఫిబ్రవరి 4( హింస) జనసేనతో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లా
....


ఆంధ్రప్రదేశ్ : అమరావతి :ఫిబ్రవరి 4( హింస)

జనసేనతో పొత్తులపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు క్లారిటీ ఇచ్చారు. జన సేనతో మైత్రిపై బయట అనేక ప్రచారాలు, అనుమానాలు ఉన్న నేపథ్యంలోనే “వస్తే జన సేన తో” లేదంటే జనం తోనే మా పొత్తు అంటున్నాం అని సోము అన్నారు. జనం తోనే మా పొత్తు ఆన్న నినాదం మాకు చాలా బలమైనది, ముఖ్యమైనదని చెప్పారు. ఓట్లు చీలకూడదనే పవన్ కామెంట్స్, చంద్రబాబు తో భేటీల నేపథ్యంలో బయట రకరకాల ప్రచారాలు ఉన్నాయని, అందుకే వస్తే జన సేన తో వెళ్ళాలని తాను అంటున్నట్టు స్పష్టం చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande