జమ్ముకశ్మీర్లోని దోడాలో కూలిన ఇల్లు
శ్రీనగర్:ఫిబ్రవరి 4( హింస) జమ్ముకశ్మీర్లోని దోడాలో గత ఏడాది డిసెంబర్ నెలలో పలు ఇండ్లు పగుళ్లిచ్చాయి.
...


శ్రీనగర్:ఫిబ్రవరి 4( హింస) జమ్ముకశ్మీర్లోని దోడాలో గత ఏడాది డిసెంబర్ నెలలో పలు ఇండ్లు పగుళ్లిచ్చాయి. ఇందులో ఒక ఇల్లు శనివారం కూలిపోయింది. ఈ నేపథ్యంలో దాని సమీపంలోని మరిన్ని భవనాలు బీటలు వారాయి. గురువారం వరకు ఆరు ఇండ్లలో పగుళ్లు కనిపించగా శుక్రవారం నాటికి ఈ సంఖ్య 21కి చేరింది. విషయం తెలిసిన వెంటనే దోడా జిల్లా అధికారులు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయి. పగుళ్లిచ్చిన ఇండ్లను పరిశీలించాయి. జోషిమఠ్ మాదిరిగా ఈ ప్రాంతం కూడా కుంగుతున్నదని దోడా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande