చెన్నై: ఫిబ్రవరి 4( హింస) ప్రముఖ నేపథ్య గాయని వాణి జయరాం మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా..? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణి జయరాం గదిలో శబ్దం రావడంతో కిటికీలోంచి చూశానని, అప్పటికే ఆమె కింద పడిపోయి ఉన్నారని ఆ ఇంటి పనిమనిషి తెలిపింది.
వెంటనే తాను పోలీసులకు సమాచారం ఇచ్చి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టానని, అప్పటికే వాణీ జయరాం ముఖంపై తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయి ఉన్నారని, వెంటనే ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి ఆమె మరణించినట్లుగా నిర్ధారించారని పనిమనిషి చెబుతున్నది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార