పెద్దపల్లి జిల్లా లో పనిచేయుచున్న
తెలంగాణ:ఫిబ్రవరి:04:పెద్దపల్లి జిల్లా:హింస: పెద్దపల్లి జిల్లాలో పనిచేయుచున్న సమస్త మండల విధ్యాదికా
పెద్దపల్లి జిల్లా లో పనిచేయుచున్న


తెలంగాణ:ఫిబ్రవరి:04:పెద్దపల్లి జిల్లా:హింస:

పెద్దపల్లి జిల్లాలో పనిచేయుచున్న సమస్త మండల విధ్యాదికారులకు, ప్రభుత్వ మరియు లోకల్ బాడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా, గతములో ప్రమోషన్ ఆర్డర్స్ తీసుకొని వెళ్ళని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఒక క్యాటగిరి లో ఒకసారి డిక్లైన్ అయిన తరువాత రెండవసారికి ప్రమోషన్ ఇవ్వబడును. కాని రెండు సార్లు ప్రమోషన్ ఆర్డర్స్ తీసుకొని ప్రమోషన్ పై వెళ్ళకుండా డిక్లైన్ చేసిన LFL ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల ఆ క్యాటగిరి లో తదుపరి ప్రమోషన్ కొరకు ఎప్పటికి అర్హులు కారు.

భార్య భర్తలు (Spouse) క్యాటగిరి క్రింద గతములో బదిలీ అయిన వారు ప్రస్తుత పాఠశాలలో 05 సంవత్సరములు పూర్తి చేసుకొన్న ప్రధానోపాధ్యాయులు మరియు 08 సంవత్సరములు పూర్తిచేసుకొన్న ఉపాధ్యాయులు స్పౌస్ క్యాటగిరి క్రింద పరిగణన లోనికి తీసుకోబడతారు. ఇట్టి వివరములు శ్రీయుత జిల్లా కలెక్టర్, పెద్దపల్లి గారి వెబ్ సైట్ “peddapalli.telangana.gov.in”మరియు జిల్లా విద్యాధికారి, పెద్దపల్లి గారి వెబ్ సైట్ “peddapallideo.com” పొందుపర్చనైనదని, ఇట్టి వివరములను అందరూ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సరిచూసుకొనవలెనని, ఇట్టి జాబితాలో ఏమయినా పొరపాట్లు గాని దోషాలు గాని ఉన్నట్లయితే అట్టి వారు తేది: 05.02.2023 రోజు మధ్యాహ్నం 2.00 గంటల వరకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయములో సంబంధిత ద్రువపత్రములతో సమర్పించవలెనని శ్రీమతి డి. మాధవి, జిల్లా విద్యాశాఖాధికారి, పెద్దపల్లి గారు ఒక ప్రకటనలో తెలియజేయనైనది.

హిందూస్తాన్ సమాచార/బి.నాగభూషణం


 rajesh pande