లిక్కర్స్ స్కాం పై పొన్నాల వాఖ్యలు
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 12( హింస) పొన్నాల లక్ష్మయ్య లిక్కర్స్ స్కాం పై వాఖ్యలు చేశారు. తాజాగా
లిక్కర్స్ స్కాం పై పొన్నాల వాఖ్యలు


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 12( హింస)

పొన్నాల లక్ష్మయ్య లిక్కర్స్ స్కాం పై వాఖ్యలు చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ను ఈడీ విచారణ చేసింది వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఆ సమాచారం బయటకు రాకుండా చేశారని ఆయన అన్నారు. దొంగ పాస్ పోర్ట్ కేసు, కేంద్ర మంత్రిగా సహారా కుంభకోణం కేసులున్నాయని, అవి ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వీటిని కేంద్రం ఎందుకు విచారణ చేయడం లేదని ఆయన అన్నారు. లిక్కర్ స్కామ్ ను ప్రచారం కోసం వాడుతున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ దొందూ దొందే అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. ఫామ్ హౌస్ కేసు ఎందుకు జాప్యం అవుతుందని, ఎక్కువ లిస్టింగ్ కంపెనీలు ఉన్నా అదానీ కంపెనీ షేర్లు ఎందుకు కొన్నారని ఆయన అన్నారు. ఆధారాలు ఉన్నాయని చెప్తున్న పెండింగ్ కేసులు కూడా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande