ఎమ్మెల్యేకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్య
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 12( హింస) వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆర
ఎమ్మెల్యేకు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సర్పంచ్ నవ్య


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 12( హింస)

వరంగల్ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణల్లో కొత్త ట్విస్ట్ నెలకొంది. జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి ఎమ్మెల్యే రాజయ్య వెళ్లారు. సర్పంచ్ నవ్య, ఆమె భర్తతో కలిసి రాజయ్య ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ప్రెస్మీట్లో మరో ట్విస్ట్ ఇచ్చిన సర్పంచ్ నవ్య. రాజయ్య పక్క కూర్చుని ఆయనపై తీవ్ర ఆరోపణ చేశారు నవ్య. ఎమ్మెల్యే రాజయ్య పక్కన ఉండగానే ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. నేను చేసిన ప్రతి ఆరోపణ నిజం అంటూ తేల్చి చెప్పారు సర్పంచ్ నవ్య.

నన్ను లైంగికంగా వేధించిన వెధవల భరతం పడతానంటూ హెచ్చరించారు. నాపై జరిగిన లైంగిక వేధింపులపై పోరాటం చేస్తానంటూ సర్పంచ్ నవ్య హెచ్చరించారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande