స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలే,సెన్సెక్స్ 337 పాయింట్లు డౌన్.. నిఫ్టీ 17వేల మార్క్కు పరిమితం
ముంబై: అమెరికా బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వడ
స్టాక్‌ మార్కెట్‌ 


ముంబై: అమెరికా బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లను వెంటాడుతోంది. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, కొనసాగుతున్న విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఇన్వెస్టర్లను మరింత కలవరపెట్టాయి. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు కొద్దిసేపటికి నష్టాల్లోకి మళ్లాయి. ప్రధానంగా బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్ షేర్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. ఇంట్రాడేలో 571 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ చివరికి 338 పాయింట్ల పతనంతో 57,900 వద్ద స్థిరపడింది. ఒక దశలో నిఫ్టీ 17వేల స్థాయిని కోల్పోయింది. ఆఖరికి 111 పాయింట్లు నష్టపోయి 17,043 వద్ద నిలిచింది. ఈ ముగింపు స్థాయిలు అయిదు నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం.

హిందుస్థాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande