విద్యార్ధులకు వైయస్ జగన్ ప్రభుత్వం శుభవార్త
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : మార్చ్ 18 (హిం స) విద్యార్థులకు వైయస్ జగన్ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్
విద్యార్ధులకు వైయస్ జగన్ ప్రభుత్వం శుభవార్త


ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : మార్చ్ 18 (హిం స) విద్యార్థులకు వైయస్ జగన్ ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా అందిస్తున్న జగనన్న విద్యా దీవెన.. నాల్గో విడత నగదు రేపు అనగా ఆదివారం తల్లుల ఖాతాలో జమ కానున్నాయి.

ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్.. అక్కడ జరిగే కార్యక్రమంలో బటన్ నొక్కి జేవీడీకి అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమచేయనున్నారు.

హిందుస్థాన్.సమాచార/రాజీవ్


 rajesh pande