బండి సంజయ్ పచ్చి అవకాశవాది.....ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) బండి సంజయ్ పచ్చి అవకాశవాది అని, తన స్వార్థ ప్రయోజనాల కోసం యు
బండి సంజయ్ పచ్చి అవకాశవాది.....ఎమ్మెల్యే సుంకె రవిశంకర్


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

బండి సంజయ్ పచ్చి అవకాశవాది అని, తన స్వార్థ ప్రయోజనాల కోసం యువతను రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని బూరుగుపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో నిందితులంతా బీజేపీ కార్యకర్తలే అని ఆయన పేర్కొన్నారు. ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే సంజయ్ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మతం పేరుతో యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, ప్రభుత్వ పనితీరు, వ్యవస్థపై బండికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande