కేంద్రంపై మండిపడ్డ బోయినపల్లి వినోద్ కుమార్
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
కేంద్రంపై మండిపడ్డ బోయినపల్లి వినోద్ కుమార్


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రంపై మండిపడ్డారు. జాతీయ హోదా కోరలేదని పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా ఏనాడు కోరలేదని అనడం సరికాదని పేర్కొన్నారు. నీళ్లు ,నిధులు,నియామకాలు సాధించుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందని స్పష్టం చేశారు. నాడు నీటి పారుదల మంత్రి గా ఉన్న హరీశ్రావు పలుమార్లు కేంద్రంలోని మంత్రులకు జాతీయ హోదా కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande