సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వరంగల్ కలెక్టరెట్ లో ఏర్పాటు చేసిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు గాని శ్వాస తీసుకోలేని వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం సీపీఆర్ పై శిక్షణను ప్రారంభించిందని వెల్లడించారు. అత్యంత కీలకమైన సీపీఆర్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో సీపీఆర్ ప్రక్రియను కొనసాగించక పోతే మూడు నుంచి నాలుగు నిమిషాలు తర్వాత ఆక్సిజన్ లేకపోవడంతో మనిషి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయని తెలిపారు. వరంగల్ జిల్లాలో నలుగురు మెడికల్ ఆఫీసర్స్ హైదరాబాద్ లో సీపీఆర్ పై మాస్టర్ శిక్షణ తీసుకొన్నారని చెప్పారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande