జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కప్పుల
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా ప
జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి కప్పుల


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకం ద్వారా ఇండ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం అందజేయనున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందిస్తున్నామని వివరించారు. గ్రామాలాభివృద్ధికి ప్రభుత్వం పకడ్బందీ కార్యచరణను అమలు చేస్తుందని పేర్కొన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande