జంటనగరాలలో భారీ వర్షం
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శన
జంటనగరాలలో భారీ వర్షం


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగరాల పరిధిలో పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. బోయిన్పల్లి, మారేడ్పల్లి, చిలుకలగూడ, బేగంపేట, ప్యాట్నీ, అల్వాల్, తిరుమలగిరి, కూకట్పల్లి, హైదర్నగర్, జీడిమెట్ల, ఆల్విన్ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట, కాప్రా, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మాదాపూర్, హైటెక్సిటీ, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్, పంజాగుట్టతో పాటు తదితర ప్రాంతాల్లో కొద్దిచోట్ల వానపడింది. పలుచోట్ల వడగళ్లు సైతం కురిశాయి. ఒక్కసారిగా వర్షం కురవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande