అయోమయంలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం చేయూతనిచ్చింది..... మంత్రి కొప్పుల
తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస ) జగిత్యాల జిల్లా పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ
అయోమయంలో ఉన్న రైతాంగానికి ప్రభుత్వం చేయూతనిచ్చింది..... మంత్రి కొప్పుల


తెలంగాణ : హైదరాబాద్ : మార్చ్ 18( హింస )

జగిత్యాల జిల్లా పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం శనివారం జరిగింది. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ లోక నిర్మలా మల్లారెడ్డితో పాటు సభ్యులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.... వ్యవసాయ మార్కెట్ కమిటీలు రైతులకు సేవ చేయడానికి తప్ప రాజకీయాలు చేసేందుకు కాదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటులో రిజర్వేషన్ లేదని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయంగా రైతుబంధుతో పాటు రైతుబీమా రైతు కుటుంబానికి ధీమా కల్పించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు సాగునీరందిస్తున్నారన్నారు. అయోమయంలో ఉన్న రైతాంగానికి చేయూతనిచ్చేందుకు సీఎం ధాన్యం కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నారని, కేంద్రం సహకరించకున్నా రైతులను ఆదుకోవాలన్న సంకల్పంతోనే కొనుగోలు చేస్తున్నారన్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande