శ్రీ రామనవమి వేడుకలపై జార్ఖండ్ ప్రభుత్వం ఆంక్షలు.. హజారీబాగ్లో ఉద్రిక్తత
హజారీబాగ్ , 18మార్చి (హిం.స): రామనవమి ఉత్సవాలపై జార్ఖండ్ లోని జెఎంఎం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మ
శ్రీ రామనవమి వేడుకలపై జార్ఖండ్ ప్రభుత్వం ఆంక్షలు.. హజారీబాగ్లో ఉద్రిక్తత


హజారీబాగ్ , 18మార్చి (హిం.స): రామనవమి ఉత్సవాలపై జార్ఖండ్ లోని జెఎంఎం ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ముఖ్యంగా హజారీబాగ్ లో దీనిపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జార్ఖండ్ లోని పాలము జిల్లాలో మసీదు ముందు ప్రవేశద్వారం ఏర్పాటు చేయడం హింసకు దారి తీసింది. ఇది జరిగిన కొన్ని రోజులకే ప్రభుత్వం రామనవమిపై ఆంక్షలు విధించింది. హజారీబాగ్ లో ప్రతీ ఏటా రామనవమి వేడులకు అట్టహాసంగా జరుగుతాయి. అయితే రామ నవమి ఊరేగింపు సందర్భంగా ఎలాంటి సంగీతాన్ని పెట్టకూడదని, కర్రలు, వెదురులతో సంప్రదాయ నృత్యాలు నిర్వహించకూడదని, ఆయుధాల విన్యాసాలు చేయకూడదని నగరంలో ఆంక్షలు విధించింది.

ప్రభుత్వం నియంతలా వ్యవహరిస్తోందని హజారీబాగ్ లోని బాద్కాగావ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అన్నారు. హిందూ పండగల పట్ల వ్యవస్థ సున్నితంగా ఉండాలని ఆమె అన్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు రాష్ట్రంలోని సామాజిక వ్యవస్థను చెడగొడుతోందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది

హిందుస్థాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande