మధ్యప్రదేశ్లో కుప్పకూలిన ట్రైనీ చార్టర్ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
ఢిల్లీ, 18మార్చి (హిం.స):మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్ల
మధ్యప్రదేశ్లో కుప్పకూలిన ట్రైనీ చార్టర్ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి


ఢిల్లీ, 18మార్చి (హిం.స):మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు దుర్మరణం పాలయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భక్కుటోలా గ్రామంలోని దట్టమైన అడవిలో ట్రైనీ చార్టర్ విమానం కూలిపోయింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఇందులో ఒక పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, మరొకరి మృతదేహం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

కిర్నాపూర్లోని భక్కుటోలా వద్ద ట్రైనర్ విమానం కూలిపోయిందని పోలీసులకు సమాచారం అందిందని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య మిశ్రా తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసు బలగాలు బయలుదేరాయి. మృతుల పేర్లు, విమానం ఎక్కడికి వెళుతోంది, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హిందుస్థాన్ సమాచార,నాగరాజ్


 rajesh pande