ఎర్రచందనం రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్ష
ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : 24 మార్చ్ (హిం స) ఎర్రచందనం రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5లక
ఎర్రచందనం రవాణా కేసులో ఇద్దరికీ ఐదేళ్ల జైలు శిక్ష


ఆంధ్ర ప్రదేశ్ : అమరావతి : 24 మార్చ్ (హిం స) ఎర్రచందనం రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్ష, రూ.5లక్షల చొప్పున జరిమానా విధిస్తూ తిరుపతిలోని ఎర్రచందనం కేసుల కోర్టు గురువారం తీర్పునిచ్చింది.

కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నగేష్ కథనం మేరకు..కడప జిల్లా దువ్వూరు మండలం ఇందిరమ్మ కాలనీకి చెందిన అవిలి శ్రీరాములు, ప్రొద్దుటూరు మండలం రేగులపల్లెకు చెందిన మడకబాబు ప్రొద్దుటూరు రేంజ్ పరిధిలో ఎర్రచందనం దుంగలను వాహనంలో తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

సాక్ష్యాధారాలతో నేరం నిరూపణ కావడంతో ఇద్దరికీ గురువారం శిక్ష విధించారు. జ

హిందుస్థాన్ సమాచార ,రాజీవ్


 rajesh pande